రూ.45 కోట్లతో గద్వాలలో రింగురోడ్డు

మంత్రి డీకే అరుణ
హైదరాబాద్‌,జనవరి10(జనంసాక్షి):
గద్వాల్‌ రింగ్‌ రోడ్‌ 15. 4 కి. విూ నిర్మించడానికి రూ. 45 కోట్ల అంచనా ఖర్చులతో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసరఫరాల శాఖామంత్రి డి.కె అరుణ తెలిపారు. గురువారం హైదరాబాదులోని సచివాలయంలోని మంత్రి చాంబర్‌ లో రింగ్‌ రోడ్డు నిర్మాణం ఇతర నియోజకవర్గ అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్‌ గిరిజాశంకర్‌ , రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశమై సంక్షేమాభివృద్ది పనులపై మంత్రి సవిూక్షించారు. ఈ సదర్బంగా మాట్లాడుతూ గద్వాల రింగ్‌ రోడ్డు నిర్మానంలో గద్వాల అభివృద్దితో పాటు రవాణ సౌకర్యం చాలా మెరుగు పడుతుందన్నారు. రోడ్డు నిర్మానం భూసేకరణ కార్యక్రమాన్ని తక్షణమే మెదలు పెట్టాలని మంత్రి ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ పనులను సంబంధిత శాఖాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా జరిగే విధంగా చూడాలన్నారు. భూసేకరణ పూర్తి కాగానే టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా చేపట్టడానికి సమాయత్తం కావలన్నారు. అధికారులు ఇదివరకే రింగ్‌ రోడ్డు నిర్మాణం కోసం సర్వే పనులు పూర్తి చేసుకున్నారని అన్నారు. రోడ్డు నిర్మాణంలో విద్యుత్తు లైన్లు, మ ంచినీటి పైప్‌లైన్లు అంతరాయంగా ఉంటే అవి తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల న్నారు. విద్యుత్‌ శాఖా అధికారులుతో సమాఏవశం ఏర్పాటు చేసి విద్యుత్‌ తీగులు మార్చుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గద్వాల నడిబొడ్డు నుంచి రాయిచూరుకు వెళ్లే రోడ్డు చాల ఆఇరుకుగా ఉందని రవాణ వాహనాలకు, పట్టణ ప్రజలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. రోడ్డు నిర్మాణం అయితే రవాణ సౌకర్యం మెరుగపడుతుందన్నారు. సాగునీటి ప్రజాఎక్టు పనులు సకాలంలో పూర్తి చేయుటకు ఇంజనీర్లు కట్టుబడి ఉండాలన్నారు. జూన్‌లో భీమా ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించుటకు అన్ని ఏర్పాటు చేయాలన్నారు. సాగునీటితోపాటు
ఆయా ప్రాంతాల్లో మంచినీటి సమస్య తెల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం వర్షాబావం అధికంగా ఉన్నందువల్ల గద్వాల నియోజకవర్గటంలోని అన్ని మండలాలకు తీవ్ర మ ంచినీటి కష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మంచినీటి సమస్య అదిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. అధికారులందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్దికి తోడ్పడే విధంగా వ్యక్తిగత శ్రద్దతో పనిచేయడానికి కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న సంక్షేమాభివృద్ది పనులు పేద ప్రజలకు చేరే విధంగా విస్తృతంగా జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.