రెండు కప్పులు మనవే..

కబడ్డీ పురుషుల, మహిళల ప్రపంచకప్‌లు భారత్‌ సొంతం

లూథియానా: ప్రపంచ కప్‌ కబడ్డీ టైటిల్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఏకపక్షంగా సాగిన పైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు మలేషియాను చిత్తుగా ఓడించింది. ఈమ్యాచ్‌లో భారత్‌ 72.12 పాయింట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత తొలి అర్థ భాగం ముగిసే పరికి 4206 పాయింట్లతో టాప్‌ రేంజీలో ఉంది. భారత క్రీడాకారిణులు ప్రియాంక పిలినియా, సుఖవిందర్‌ కౌర్‌లు వరుసగా 13-8-8చొప్ప పాయింట్లు సాధించారు. మరోవైపు భారత స్టాపర్‌ జితేందర్‌ కౌర్‌, అనురాణి 11,10 పాయింట్లు దక్కించారు. టైటిల్‌ విజేతగా నిలిచిన భారత జట్టు 51 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అలాగే, రన్నరప్‌కు రూ.31లక్షలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.21లక్షల బహుమతి అందచేశారు.

కప్పుకొట్టిన పురుషుల జట్టు..

పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన ప్రపంచ కప్‌ కబడ్డీ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై 59-22 పాయింట్ల తేడాతో నెగ్గి కప్‌ను సొంతం చేసుకుంది.  పంజాబ్‌లో ఏకపక్షంగా సాగిన పైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు పాక్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్‌ చివరికి టైటిల్‌ను సొంతం చేసుకుంది.