రెండు సీట్లు మావే

3

– ప్రతిపక్షాలకు సంఖ్యాబలంలేదు

– ఎంఐఎం మా వెంటే

– ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌,మే30(జనంసాక్షి):తెలంగాణ నుంచి రాజ్యసభకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 40 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా.. ఇతర ఏ పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి తమ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని ఆశిస్తున్నామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.రేపు (31) ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ నామినేషన్లు దాఖలు చేస్తారని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇద్దరు మంచి అభ్యర్థులను రాజ్యసభకు టిఆర్‌ఎస్‌ తరఫున ఎంపిక చేశారని నాయిని ప్రశంసించారు.

హైదరాబాద్‌ లోని టిఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.