రెండో రోజూ టీ ఎంపీల దీక్ష

సంఘీభావం ప్రకటించిన జైపాల్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం రెండో రోజూ సత్యాగ్రహ దీక్ష కొనసాగించారు. ఉదయం పార్లమెంట్‌ మొదట గేట్‌ ఎదుట బైఠాయించిన ఎంపీలకు కేంద్ర మంత్రి ఎస్‌. జయపాల్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న ఎంపీలు అభినందనీయులన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం వివేకానంద, సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని మరిచి కొందరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, యూపీఏ కామన్‌ మినిమం ప్రోగ్రాంలో, రాష్ట్రపతి    మిగతా 2లోప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు వారెందకు మాట్లాడలేదని, అప్పుడెందుకు సమైక్యాంధ్ర అనలేదని ప్రశ్నించారు. తెలంగాణపై తేల్చకుండా విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా మొండిగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళనకు టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి సంఘీభావం ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట సత్యాగ్రహ దీక్షకు దిగిన ఎంపీలు రాత్రి అక్కడే నిద్రించారు. మంగళవారం ఉదయం దీక్ష కొనసాగించారు.