రెడ్యానాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి

మంచి పదవితో సేవచేస్తాడు

డోర్నకల్‌ సభలో సిఎం కెసిఆర్‌

డోర్నకల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): డోర్నకల్‌లో రెడ్యానాయక్‌ను అధికశాతం ఓట్లతో గెలిపించాలని, అతనికి మంచి భవిష్యత్‌ ఉందని సిఎం కెసిరా/- అన్నారు. గెలిస్తే మంచి ¬దాలో విూ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. 50 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా డోర్నకల్‌ ని పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. డోర్నకల్‌ లో 84 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. త్వరలో డోర్నకల్‌ నియోజకవర్గంలో 84 మంది గిరిజనులు సర్పంచులు కాబోతున్నారని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఎన్నికలయ్యాక పంచాయితీ ఎన్నికలు జరగుతాయన్నారు. డోర్నకల్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ..ప్రజలు గెలిచే ప్రజాస్వామ్యం వస్తేనే ఆశించిన అభివృద్ధి జరుగుతదన్నారు. 58 ఏండ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్‌ కూటమి ఒక వైపు..నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ ఒక వైపు అని సీఎం అన్నారు. నాలుగేళ్ల క్రితం కరెంట్‌ ఎలా ఉంది..ఇప్పుడెలా ఉందో చర్చ పెట్టాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు సూచించారు.రాష్ట్ర రాజకీయాల్లో రెడ్యానాయక్‌ చాలా సీనియర్‌ నాయకుడు. పాలేరు నుంచి డోర్నకల్‌ కు కూడా నీళ్లు కావాలని

రెడ్యానాయక్‌ నాతో కొట్లాడిండు. తన ప్రజలు బాగుండాలని రెడ్యానాయక్‌ తపన. డోర్నకల్‌ కు ఎస్సారెస్పీ కాలువ వస్తోంది..దాన్ని రూ.వెయ్యి కోట్లతో బాగు చేస్తున్నమని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. సభకు వచ్చిన జనాలను చూస్తుంటే రెడ్యానాయక్‌ గెలిచినట్లేనని స్పష్టమవుతోందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ గిరిజనులు ఉండే నియోజకవర్గం డోర్నకల్‌ అని..రెడ్యానాయక్‌ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమనిపిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంచి మార్పు రావాలంటే ప్రజలే గెలవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెల రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి సీతారం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా సభకు భారీగా హాజరయ్యారు.