రెడ్ క్రాస్ తరఫున టార్ఫాలిన్ కవర్ల అందజేత

జులై … (జనంసాక్షి) గత కొన్ని రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు పాక్షికంగా ఇల్లు కూలి ఇబ్బందులు పడుతున్న వారికి బిచ్కుంద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల తరఫున మండలంలో గల రాజుల్ల, శాంతాపూర్, వాజీద్నగర్, పుల్కల్ తదితర గ్రామాలలో టార్ఫాలిన్ కవర్లను అందించినట్లు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రచ్చ శివకాంత్  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు అశోక్ పటేల్, బిచ్కుంద తహసిల్దార్ రవికాంత్,  ఆర్ ఐ సాయిబాబా, రెడ్ క్రాస్ సభ్యులు రమణస్వామి, డాక్టర్ ఓం ప్రకాష్, డా నర్సింలు, సంతోష్, హుండే బస్వరాజు తదితరులు పాల్గొన్నారు.