రేపటి నుంచి రిజిస్ట్రేషన్‌ వాయింపు

హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి): రాష్ట్రంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ల చార్జీలను ప్రభుత్వం పెంచింది.  ఈ మేరకు శనివారంనాడు జీవో జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నది. అలాగే మార్కెట్‌ విలువ మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా పెంపు వల్ల ప్రజలపై  ఏడాదికి 1600 కోట్ల రూపాయల మేర భారం పడనున్నట్టు సమాచారం. ఒక్కో ప్రాంతాన్ని బట్టి.. ఒక్కో రకంగా చార్జీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ, నగరాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ప్రస్తుతం ఉన్న చార్జీల కంటే 30శాతం అదనంగా పెరిగినట్టు సమాచారం. అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల కొనుగోలు దారులపై అదనంగా కొంత మేర భారం పడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. రిజిస్ట్రేషన్ల ధరలు పెరగనుండడంతో కొనుగోలుదారులు   రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు భారీ ఎత్తున కార్యాలయాలకు చేరుకున్నారు.