రేపు ఓజోన్ దినోత్సవ వేడుకలు

సూర్యాపేట (జనంసాక్షి ):ఈ నెల 16న ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ , ఓజోన్ పొర సంరక్షణ – ఆవశ్యకత గురించి అవగాహన పెంపొందించుటకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు గోళ్ళమూడి రమేష్ బాబు , శ్రీరాం ఆంజనేయులు తెలిపారు.బుధవారం ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను డీఈఓ అశోక్ ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ పోటీలను జిల్లా కేంద్రంలోని శ్లోక స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఓజోన్ పొర సంరక్షణ- మన కర్తవ్యం అనే అంశంపై ఉపన్యాస పోటీలు , ప్రకృతి పరిరక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై
వ్యాసరచన పోటీలు , పర్యావరణ పరిరక్షణ – లాభాలు , ప్రకృతి వైపరీత్యాలు – నష్టాలు అనే అంశంపై డ్రాయింగ్ డిస్ప్లే పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు ఏ3 సైజ్ డ్రాయింగ్ షీట్ పై ఇంటి వద్దనే డ్రాయింగ్ వేసుకొని ప్రదర్శనకు తీసుకురావలెనని సూచించారు.ఎటువంటి పార్టిసిపేషన్ ఫీజు లేదన్నారు.6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ పాల్గొనవచ్చని చెప్పారు.మరిన్ని వివరాలకు షేక్ జాఫర్ – 9347394456 , ఇటుకుల సైదులు – 9959197835 , మారం నారాయణరెడ్డి – 9848053562 సంప్రదించాలని తెలిపారు.
Attachments area