రేషన్ డీలర్ల సమస్యలను ప్రస్తావించండి
జనగామ,అక్టోబర్30(జనంసాక్షి): రేషన్ డీలర్లకు కనీస వేతనం రూ. 30 వేలు చెల్లిస్తూ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల్లో తమ సమస్యలను ప్రస్తావించాలని వారు కోరారు. 40 ఏళ్లుగా రేషన్ షాపులతో కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. రేషన్ షాపులను రద్దు చేస్తామని, నగదు బదిలీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని, ఇలాగైతే తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ సమస్యలను ప్రధానంగా చర్చించిన వారికే అండగా ఉంటామని అన్నారు.