రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
జోగులాంబ గద్వాల ప్రతినిధి. జూలై 11 ( జనం సాక్షి)రేషన్ డీలర్ల న్యాయమైన హక్కులను కల్పించాలని కోరుతూ ఆల్ ఇండియా రేషన్ డీలర్ ఫెడరేషన్ అనుబంధంగా తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పనిచేస్తుంది.జోగుళాంబ గద్వాల్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. రేషన్ డీలర్లను పట్టించుకునే నాధుడే లేడని ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు రూ.440 కమిషన్ ఇవ్వాలని, రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆథరైజేషన్ లైసెన్స్ రెన్యూవల్ గడువు 5సంవత్సరాలు పెంచాలని, మంచినునె, పప్పులు ఇతర వస్తువులు రేషన్ షాపుల ద్వారానే అమ్మేటట్లు, చూడాలని తెలిపారు. సరుకులు అన్లోడింగ్ చార్జీలను ప్రభుత్వంమే భరించాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షుడు నిసార్ పాష, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, కోశాదికారి అబ్దుల్ ఖదీర్, సలహాదారులు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.