రేషన్ బియ్యాన్ని విదేశాలకు

1రేషన్ బియ్యం దందా ఖమ్మం జిల్లాలో కొత్త పుంతలు తొక్కుతుంది.రేషన్ బియ్యాన్ని ఏకంగా విదేశాలకు అమ్మేస్తూ… లక్షలు సంపాదించుకుంటున్నారు అక్రమార్కులు. ఖమ్మం జిల్లాలో 8 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 7 లక్షల 24 వేల కుటుంబాలకు రేషన్ బియ్యం అందుతున్నయి. రూపాయి కిలో బియ్యం పథకం కింద 13వేల 121 మెట్రిక్‌ టన్నుల బియ్యం జిల్లాలో సరఫరా చేస్తున్నారు. అయితే రేషన్‌ బియ్యం అవసరం లేని వాళ్లు బియ్యం కోటాను వదులుకోక పోగా… డీలర్‌కే ఎనిమిది రూపాయలకు కిలో బియ్యం అమ్ముకుంటున్నారు. దీంతో రేషన్‌ డీలర్లు మిల్లర్లకు కేజీ బియ్యం 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు.
డీలర్ల వద్ద తీసుకున్న బియ్యాన్ని మిల్లర్లు పాలిషింగ్‌ చేసి బహిరంగ మార్కెట్‌లో కిలో 40 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అలాగే అధికారుల కళ్లు గప్పి బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పేదల బియ్యం పేరుతో జరుగుతున్న అక్రమదందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ దందాకు అడ్డుకట్ట వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విసృతంగా దాడులు చేస్త్తూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నమంటున్నారు. అక్రమదందాకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బియ్యం దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు