రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిధరలు

భారీగా పడిపోయిన రేట్లు
భోపాల్‌,మే21(జ‌నం సాక్షి):  మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయల ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది పంటదిగుబడి తగ్గగా ఈ యేడాది పంట దిగుబడి పెరనగడంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి ఏర్పడింది. దీనికతోడు ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టోకు మార్కెట్లలో నాణ్యతను అనుసరించి కిలో అర్ధ రూపాయి నుంచి రూ.5 వరకు పలికింది. నీముచ్‌లోని ఉల్లిపాయల మార్కెట్‌లో కిలో 50 పైసలు నుంచి రూ.5 వరకు కొనుగోలు చేశామని అక్కడి వ్యాపారి సవిూర్‌ చౌదరి తెలిపారు. భోపాల్‌లో రూ.2 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేశారని అక్కడి కృషి ఉపాజ్‌ మండీ సమితి కార్యదర్శి వినయ్‌ ప్రకాశ్‌ పటేరియా చెప్పారు. ఈసారి పంట చాలా బాగా పండడంతో మార్కెట్‌కు మరింత సరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో చిల్లరగా కిలో ఉల్లి
రూ.10 పలుకుతోంది.