రైతుబంధుతో అన్నదాతల్లో ఆనందం: జోగురామన్న

ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరాజ్‌ గ్రామంలో జరిగిన రైతుబంధు పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుండదని భావించిన సీఎం కేసీఆర్‌ రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూసేందుకే ఈ రైతుబంధు పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో తొలిరోజు 1,34,585 మంది రైతులకు రూ. 290 కోట్ల విలువ చేసే చెక్కులను అందించడం జరుగుతోందన్నారు. రెండవ విడుత చెక్కుల పంపిణీ కార్యక్రమం నవంబర్‌ నెలలో ఉంటుందన్నారు. గత పాలకులు రైతులను విస్మరించారు. ప్రస్తుతం తెలంగాణలోని సంక్షేమ పథకాల అమలు తీరుతో దేశం మొత్తం మనవైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు.

తాజావార్తలు