రైతుబంధుతో పెట్టుబడి సాయం అందచేత
పథకాలను సద్వినయోగం చేసుకోవాలన్న రేఖ
ఆదిలాబాద్,జూన్6(జనం సాక్షి): రైతుబంధుతో అందిన డబ్బులతో వ్యవసాయంలో పురోగతి సాధించాలనిఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందచేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. రైతుబంధు పథకంలో ప్రతి రైతుకూ ప్రభుత్వం ఎకరానికి రూ.నాలుగు వేలు అందించిందన్నారు. రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రత్యేకంగా ట్రాక్టర్లను, ఇతర యంత్రాలను మంజూరు చేసిందన్నారు. రైతుల అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతులకు అందిస్తున్న సబ్సిడీ సోయా విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు. సబ్సిడీ విత్తనాలు పొందిన రైతుల వివరాలను అధికారులు అన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని చెప్పారు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చనాక-కొరాట బ్యారేజీ నిర్మాణం చేపట్టి రైతుల కల సాకారం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. రూ.386 కోట్లతో బ్యారేజీ నిర్మాణాలు, పంపుహౌస్ పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టు ద్వారా 52 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మధ్య తరహా ప్రాజెక్టులైన సాత్నాల, మత్తడి వాగుతో పాటు 457 చెరువుల ద్వారా ఒక లక్షా 13వేల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో మొదటి, రెండు దశల్లో 175 చె రువుల పునరుద్ధరణ పనులను రూ.88 కోట్లతో పూర్తి చేసి 32,576 ఎకరాలు ఆయకట్టు అభివృద్ధి చేశామన్నారు. మూడు, నాలుగో దశలలో 44 చెరువుల మరమ్మతు, 20 కొత్త చెరువులు మంజూరైనవని, జైకా పథకం కింద 18 చెరువులను రూ.59.27కోట్లతో ఎకరాల సాగు యోగ్యంగా ఉండేందుకు పనులు చేపట్టి, వచ్చే జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు.