రైతుబీమాతో మరింత భరోసా

ఖమ్మం,జూన్‌25(జ‌నం సాక్షి ): అన్నదాతకు రైతుబంధు ద్వారా పెట్టుబడి అందించిన రాష్ట్ర ప్రభుత్వం..బీమా కల్పించి కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. పట్టా కలిగిన ప్రతి రైతుకు బీమా కల్పించి, ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే ప్రభుత్వమే చెల్లించనుందన్నారు. ప్రముఖ బీమా కంపెనీ అయినా జీవిత బీమా సంస్థకు ఈ బాధ్యతలను అప్పజెప్పడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకానికి సంబంధించిన ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల వివరాలు సేకరణ ముమ్మరంగా సాగుతోంది. పథకానికి భవిష్యత్‌లో ఎలాంటి అవరోధాలు కలగ కుండా ఉండేందుకు గాను అధికారులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు దిశానిర్దేశం చేసేందుకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కన్వీనర్లకు అధికారులకు అవగాహన కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,500 మంది రైతు సమన్వయ సమితి సభ్యులు, అన్ని విభాగాల వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.