రైతులకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు
ఆదిలాబాద్,జూలై3(జనంసాక్షి): ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో వివిధ పంటలు సాగవుతాయని
అంచనా వేసిన వ్యవసాయశౄఖ ఇందుకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటికే విత్తనాలు వేసిన వారు వర్షాలు లేక నష్టపోయారు. కొన్నిచోట్ల విత్తన మొలకలను కాపాఉడుకునేందుకు నానాయాతన పడుతున్నారు. ఇకపోతే ఎరువులను అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఈ సారి పత్తి, సోయా, కంది, జొన్న, వరి, మొక్కజొన్న, పెసర, ఇతర పంటలు సాగయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు ఎరువులను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి అవసరమైన ఎరువులు, విత్తనాలు పొందాలని అన్నారు.