రైతులకు పత్తిలో వెరైటీ రకంపై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లు పొలములో పత్తిపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని సూపర్ సీడ్స్ జోనల్ మేనేజర్ మధుసూదన్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సీడ్స్ 971 బిజీ 2 పత్తి రకం వెరైటీ పొలం చూసి రైతులు బాగుందన్నారు,పొలం చూసి పండించిన రైతుకు చిన్న గిఫ్ట్ ఇచ్చి సాలువాతో సన్మానించడం జరిగిందని అన్నారు. అనంతరం రైతు కాశయ్య మాట్లాడుతూ ఈ వెరైటీ పత్తి రకం బాగుందని చెట్టుకు 60 నుడి 90 కాయలు వరకు ఉన్నాయని, వేసుకోదగ్గ పత్తి రకమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ రాజగోపాల్,ఏరియా ఇంచార్జి వెంకటేశ్వర్లు, ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్,బాల కోటయ్య,గ్రామ చుట్టు పక్కగ్రామాల రైతులు పాల్గొన్నారు.