రైతులకు మేలు చేయడమే సొసైటీ లక్ష్యం

కృష్ణ కేసముద్రం పసుపు ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు నీలం దుర్గేష్
కేసముద్రం జులై 29 జనం సాక్షి  / రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో పాటు వ్యవసాయ సలహా సూచనలు అందించేందుకు కృష్ణ కేసముద్రం పసుపు ఉత్పత్తిదారుల సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం అధ్యక్షుడు నీలం దుర్గేష్ అన్నారు.గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈసారి సొసైటీ నిర్వాహణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృష్ణ కేసముద్రం పసుపు ఉత్పత్తిదారుల సంస్థ ఎరువులు, పురుగు, మందులు విత్తన విక్రయాల షాపులో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని  ప్రవేశపెట్టారు. రైతులకు విక్రయించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలకు నగదు బిల్లులు ఇవ్వడంతో పాటు సొసైటీ లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. సంఘ సభ్యులు, రైతుల సంక్షేమానికి నిర్వహిస్తున్న ఎరువులు విత్తన విక్రయ షాపును వినియోగించుకోవాలని,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమటం స్వామి, ఉపాధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు, కోశాధికారి సింగంశెట్టి యాకంతం, సట్ల శ్రీను, వల్లం దాసు రవి  పాల్గొన్నారు.
Attachments area