*రైతులు రైతుభీమా పథకంలో దరఖాస్తు చేసుకోవాలి*

మునగాల, జూలై 19(జనంసాక్షి): మండలంలోని అన్ని గ్రామాల రైతులు రైతుభీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మునగాల మండల వ్యవసాయాధికారి బి.అనిల్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు రైతులు మునగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారికి తగిన పత్రాలు అందజేయాలని ఆయన కోరారు. అలాగే ఇంతకుముందు ధరఖాస్తు చేసుకున్న రైతులు నామినీ పేరు మార్చాలని అనుకున్నా లేక వారి ఆధార్ కార్డ్ లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా వాటి వివరాలు కూడా వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సరిచేయించుకోవాలని తెలిపారు. అయితే రైతులు ధరఖాస్తు చేయడానికి ధరఖాస్తు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, రైతు ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను సమర్పించాలని కోరారు.