రైతుల కోసం ఏం చేశారో బాబు చెప్పాలి
– సొమ్ము కేంద్రానిది.. సోకు చంద్రబాబుది
– కేంద్రం ఏపీకి స్కీమ్స్ ఇస్తే.. వాటిని స్కామ్స్ చేస్తున్నారు
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
నెల్లూరు, జులై4(జనం సాక్షి ) : పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ రైతుల కోసం ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత రుణాలు ఇప్పటివరకూ ఎందుకు మాఫీచేయలేదని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 300 క్లస్టర్లు ఏర్పాటు చేసిన ఘనత మోదీదే అని కన్నా తెలిపారు. అవినీతి పార్టీ టీడీపీ కావాలో, అభివృద్ధికి అద్దం పట్టే బీజేపీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని కన్నా తెలిపారు. అప్పట్లో వెంకయ్యనాయుడిని ఊరూరా తిప్పి సన్మానాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తుంగలో తొక్కి…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని కన్నా విమర్శించారు. సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది… సోకు సీఎం చంద్రబాబు ది అని ఆరోపించారు. రాష్ట్రంలో అసమర్థత, అవినీతే రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు. రాష్టాన్రికి కేంద్రం సహకరిస్తున్నా హావిూలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, ఏపీకి స్కీమ్స్ ఇస్తే వాటిలో టీడీపీ ప్రభుత్వం స్కామ్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు స్పెషల్ ప్యాకేజి కింద నిధులు తీసుకుంటూనే… మరోవైపు ¬దా ఇవ్వలేదని తెలుగుదేశం దుష్పచ్రారం చేస్తోందన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతున్నామని తెలిపిన కన్నా… టీడీపీ చేసిన అభివృద్ధి గురించి చెప్పే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా? అని సవాల్ విసిరారు.