రైతుల కోసమే సిసిఐ కొనుగోలు కేంద్రాలు
కొత్తగూడెం,నవంబర్14 (జనంసాక్షి) : సిసిఐ కొనుగోలు కేంద్రాలతో రైతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిందని జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అన్నారు. ప్రతి రైతుని కోటీశ్వరుడుని చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వ్యవసాయానికి 24గంటలు విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తుందని అన్నారు. రైతులకు, సాగునీరు, ఉచిత విద్యుత్, మద్ధతు ధర కల్పిస్తుందని అన్నారు. అదే విధంగా రైతులు సమావేశాలు అయ్యేందుకు ప్రతి మండలంలో రైతు భవనాలు నిర్మించనునున్నట్లు తెలిపారు. రైతన్నల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇదిలావుంటే భద్రాద్రిలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం మార్కెట్ కమిటీ ప్రధాన కార్యాలయ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.