రైతుల గురించి ఆలోచించేది కెసిఆర్‌ మాత్రమే


కేంద్రం తీరుతో అనేక విధాలుగా నష్టం
తెలంగాణలో బంగారు పంటలు పండేలా ప్రణాళికలు
మంత్రి వేముల ప్రశాంతరెడ్డి
నిజామాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): ఇంతకాలం దేశంలో కార్పోరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు లూటీ అవుతున్నా అన్నదాతలను మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవు. కేంద్రం తీరుతో రైతులకు అవస్థలు తప్ప ఆదరణ దక్కలేదు. ఉద్యోగులకు డిఎలు పెరుగతాయి కానీ అన్నదాతలకు పైసా విదిల్చిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణలో సిఎం కెసిఆర్‌ మాత్రం ఓ పక్కా ప్రణాళికతో రైతుల బాగుకోసం తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవిగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. రైతులను చల్లగా చూసుకుంటేనే మనం ముద్ద తినగలుగుతాం. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ చెబుతున్నదే. ఆచరణలో చేసి చూపడంలో మాత్రం అందరూ విఫలం అయ్యారు. అన్నదాత అంటూ కీర్తిస్తూ..దేశానికి వెన్నముక అంటూ పొగడడమే తప్ప మరోటి జరగడం లేదు. అందుకే ఇవన్నీ గమనించే కెసిఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయరంగంపై దార్శనికత ప్రదర్శించారని మంత్రి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రావాల్సిన సాంకేతిక మార్పులతో సహా ఆర్థిక సాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై ప్రకటించిన వివరాలు అన్నదాతకు భరోసా కలిగించేలా ఉన్నాయి. నిజానికి వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. ఇప్పటికీ కూలీల సమస్య ఉంది. కరెంట్‌ సమస్య తీరినా పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరనలు దక్కడం లేదు. ఎరువులు పురరుగు మందుల ధరలతో కుదేలవుతున్నారు. ఈ దశలో ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి సిఎం కెసిఆర్‌ పదేపదే విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ఇప్పటికే ప్రధానికి సిఎం లేఖలు కూడా రాశారని తెలిపారు. అటవీశాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గిస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ జరిగితే తప్ప అనుకున్నది సాధించలేమని కూడా అన్నారు. ఎక్కడ ఏ యంత్రాలు సమకూర్చాలో ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, అందరూ ఒకటే పంట వేస్తే అందరికీ నష్టం గనక పంటలు ఎప్పుడెలా ఎక్కడ ఎలా వేయాలో కూడా నిర్ణయిస్తామని అన్నారు. అధికారులు సూచించిన ప్రకారం పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిఉందన్నారు. గిట్టుబాటు ధర రావాలంటే అది రైతుల చేతిలోనే ఉంది. స్థానికంగా ఎక్కడ ఏ పంటలు పండుతాయో అక్కడ వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సిఎం
కెసిఆర్‌ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అత్యుత్తమ రైతులుగా తీర్చిదిద్దుతున్న ఘనత కెసిఆర్‌దే అన్నారు. అంకాపూర్‌ గ్రామాన్ని చాలామంది సందర్శించారు. ఏ ఎకరంలో ఏ పంట పండుతుందో గుర్తించారు. ఇప్పటికే కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపినట్లు వెల్లడిరచారు. రైతులను ఆర్గనైజ్‌ చేయడం వల్ల చాలా విజయాలు సాధిస్తామని అన్నారు. రైతులు వ్యవస్థీకృతమే పంట కాలనీలు కూడా సాధ్యమే. రైతులంతా ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇవన్నీ అమల్లోకి వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలు చేయూతను అందించాలి. రైతులు బాగుపడేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి. రైతులు కూడా తమ భవిష్యత్‌ కోసం పంటలను వేయడం మొదలు, పురుగుమందులు వాడడం, అమ్మకాల వరకు తగుజాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వ్యవసాయం పండగగా మారగలదని మంత్రి అన్నారు.