రైతుల సంక్షేమమే బిజెపి లక్ష్యం..

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి

తిమ్మాపూర్, అక్టోబర్ 17 (జనం సాక్షి): దేశానికి అన్నం పెట్టె రైతుల యొక్క సంక్షేమమే లక్ష్యం గా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తుందని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ నేత్రుత్వం లోని కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా పెట్టుబడి సాయం పేరిట రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసిన సందర్బంగా సోమవారం మక్తపల్లి లో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు మిఠాయిలు పంచి సంబరాల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ రైతుల యొక్క ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనమైన యాంత్రిక విధానాలను ప్రవేశపెట్టిందని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.దేశ వ్యాప్తంగా పండే పంటలకోసం అవసరమయ్యే ఎరువులపై ఏటా 60 వేల కోట్ల సబ్సిడీ ని ఇస్తుందని అన్నారు.ప్రతీ ఏటా వరి పంటకు,పప్పు దాన్యాలకు మద్దతు ధరను పెంచుతున్నారని అన్నారు.గత ప్రభుత్వాల హయాం లో యూరియా ను బ్లాక్ మార్కెట్ కు తరలించి అప్పటి నాయకులు అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. కానీ మోడీ నేత్రుత్వం లోని కేంద్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులను, పెట్టుబడి సాయం ను అందిస్తూ దేశవ్యాప్తంగా రైతుల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు.పంటల యాజమాన్యం లో భాగంగా ప్రతీ రైతు తనయొక్క భూమిలో భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని అందుకోసం నిధులు కూడా కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు.కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు రాని వారు స్థానిక మండల వ్యవసాయ అధికారులను కలవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి మల్లయ్య, మావురపు సంపత్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బోనాల మోహన్,అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్,ఈసీ మెంబర్ పాశం రాఘవరెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి సంపత్,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతం వరలక్ష్మి, మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రావుల మల్లారెడ్డి, నాయకులు మాడిశెట్టి వెంకటేష్,దుండ్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.