రైతు బంధు ఇచ్చేదెన్నడు?
వర్షాకాలం ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటి సభ్యులు సురేష్ గొండ విమర్శించారు. ఆయన బుధవారం జనంసాక్షి తో మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను కొ నసాగిస్తోందని అన్నారు. యాసంగిలో వరి నాటువేస్తే ఉరివేసుకొన్నట్టే అని , వడ్లు కొనుగోలు చేయబోమని వరి పండించే రైతులను హెచ్చరించిన ముఖ్యమంత్రి
వడ్లు కొనుగోలు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు విని ఆరుతడి పంట వేసిన రైతుల జొన్నలు ఇప్పటికీ కొనుగోలు చేయక పోవడం శోచనీయమన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటికి రుణమాఫీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.రుణ మాఫీ కాకపోవడంతో రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే విత్తనాలు, ఎరువులు ,పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తున్న పట్టించుకొనే నాధుడే లేడని ఆయన విమర్శించారు. ఇది గమనించి ప్రభుత్వం వెంటనే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో వేయాలని,లక్ష లోపు రుణాలు ఏకకాలంలో మాఫీచేసి మళ్లీ వెంటనే బ్యాంకు లు రుణాలు ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన జొన్నలు వెంటనే కొనుగోలుచేసి డబ్బులు వెంటనే అందించాలన్నారు.