రైతు బీమా దరఖాస్తుకు చివరి తేదీ జూలై 30

తిరుమలగిరి (సాగర్) జూలై 19(జనంసాక్షి):
రైతు బీమా దరఖాస్తు కు చివరి తేదీ జూలై 30 అని మండల వ్యవసాయ అధికారి జానకి రాములు ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ: 22- 6 -2022 నాటికి పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉన్న రైతులు ఇట్టి దరఖాస్తుకు అర్హులని , దరఖాస్తు గడువు జూలై 30తో ముగుస్తుందని రైతులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గతంలో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు నామిని పేరు, మరేవైనా సవరణలు ఉంటే సంబంధిత ఏఈఓ ను సంప్రదించి జూలై 22వ తేదీ వరకు మార్చుకోవాలని సూచించారు. పట్టాదారే స్వయంగా వచ్చి సంబంధిత ఏఈఓ లకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. తిరుమలగిరి, కోనేరుపురం, చిలకాపురం ,ఎల్లాపురం, నేతాపురం గ్రామాల క్లస్టర్ ఏ ఈ ఓ చరవాణి నెంబర్ 7288892366 . కొంపెల్లి, శ్రీరాంపురం, అల్వాల, రాజవరం గ్రామాల క్లస్టర్ ఏఈఓ చరవాణి 7288892367. నెల్లికల్ , జమ్మన కోట, చింతలపాలెం, తునికినూతల, తిమ్మాయిపాలెం గ్రామాల ఏఈఓ చరవాణి నెంబర్ 7288892368