రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ ముందంజ: చారి
ఆదిలాబాద్,జూలై2(జనం సాక్షి): దేశవ్యా ప్తంగా నేతలు,ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని, వ్యవసాయ రంగంలో ఇక్కడ అమలవుతున్న పథకాలను తెలుసుకోవడానికి వస్తున్నారని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. అన్నం పెట్టే రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్‌దే నన్నారు. భూ రికార్డుల ప్రకారమే ప్రతి రైతుకు ఎకరానికి పంట పెట్టుబడి సాయంగా రూ.8 వేలను రైతుకు అందజేస్తున్నామన్నారు. రైతు సంక్షేమంలో రికార్డుల సృష్టిస్తున్నామని ఈ క్యాతి సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. సమాజంలో రైతులు తలెత్తుకొని బతుకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు.రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతోందని, రైతులకు ఇప్పుడు న్యాయం జరగకపోతే ఇంకెప్పటికి జరగదని ఒక రైతు బిడ్డగా ఇది చేస్తున్న సీఎం కేసీఆర్ స్వయంగా రైతే అని ఆయనకు రైతుల కష్టాలు తెలుసన్నారు. తెలంగాణ వచ్చాక ఏనాడైనా రైతులు కరెంటు కోతలు ఎదుర్కొంటున్నారా..? కరెంట్ సబ్‌స్టేష న్ల ముట్టడి చూశారా..? ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లను చూశామా? అని ప్రశ్నించారు. రైతుల జీవితాల్లో భరోసా నింపాలనే సంకల్పంతో బీమా పథకానికి రూ.1000కోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. ప్రతి రైతుకూ ప్రభుత్వమే ప్రతి ఏటా రూ.2271.50 ప్రీమియం కడుతుందని, వారికి రూ.5 లక్షల బీమా వర్తింప జేస్తుందన్నా రు. 18 నుంచి 59ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులని, పాస్‌పుస్తకాల ఆధారంగా ఇప్పటికే గ్రామాలకు ఏఈవోలకు బా ధ్యతలు అప్పగించామన్నారు.ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు బీమా పథకంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆగస్టు 16 నుంచి ప్రమాదవశాత్తు గాని, ఎలా చనిపోయినా వారికి రూ.5లక్షల బీమా వర్తిస్తుందన్నారు.