రైతు సమస్యల పరిష్కారం కోసమే కమిటీలు

జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పంటల పెట్టుబడుల కోసం నాలుగు వేలు ఇవ్వాలంటే ముందుగా భూసర్వే పూర్తికావాల్సి ఉందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారుల భూ సర్వేలకు పొంతన లేదన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యే, ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారన్నారు. గ్రామగ్రామాన 14 మంది సభ్యులతో కూడిన రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటుతో పాటు మండల, జిల్లా కమిటీలను ఎంపిక చేసి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భూముల లెక్క

పక్కాగా సర్వే చేయనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించడంతో పాటు కార్యాలయాల చూట్టూ తిరగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రావిూణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎవరి భూమి వారు అమ్ముకొనే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషి దేశంలోనే ఆదర్శంగా నిలవనుందన్నారు.