రైనా ‘సూపర్’ సెంచరీ
చెన్నై, మే 2 (జనంసాక్షి) :
సురేశ్‌రైనా సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నై ఖాతాలో మరో విజయం నమోదైంది. గురువారం స్థానిక చెపాక్ స్టేడియంలో నిర్వహించిన ఐపీఎల్-6, 45వ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా జట్టు స్కోర్ 27 పరుగుల వద్ద ఉండగా, 18 (18 బంతుల్లో సిక్సర్, బౌండరీ సాయంతో) పరుగులు చేసి అవానా బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. హస్సీతో జత కలిసిన రైనా మొదటి నుంచే బౌలర్లపై విరుచుపడ్డాడు. 29 బంతుల్లో మూడు బౌండరీలతో 35 పరుగులు చేసి హస్సీ చావ్లా బౌలింగ్‌లో గురుక్రీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సెంకండ్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ధోని కేవలం రెండు పరుగులే చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. మోర్కెల్ 16 బంతుల్లో రెండు బౌండరీలు, సిక్సర్ సాయంతో 23 పరుగులు చేసి అవానా బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా రెండు బంతుల్లో బౌండరీ సాయంతో ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, రైనా ఇన్నింగ్స్ చివరి వరకూ అజేయంగా నిలిచి శతకం సాధించాడు. 53 బంతులనెదుర్కొన్న రైనా ఆరు సిక్సర్లు, ఏడు బౌండరీలతో సెంచరీ బాదాడు. ఐపీఎల్-6లో రైనాది మూడో సెంచరీ. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో అవానా రెండు, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీసుకున్నారు. 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 13 పరుగుల వద్ద పోమర్స్‌బ్యాచ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. 9 బంతులనెదుర్కొన్న పోమర్స్ బౌండరీ సాయంతో ఏడు పరుగులు మాత్రమే చేశాడు. మరో 23 పరుగులు జోడించిన అనంతరం మణిదీప్ సింగ్ శర్మకే వికెట్ సమర్పించుకున్నాడు. ఆరు ఓవర్లలో 36 పరుగులకు రెండు వికెట్ కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజాబ్‌ను షాన్‌మార్ష్ ఆదుకున్నాడు. హస్సీతో కలిసి జట్టు స్కోర్‌ను ముందుకు నడిపాడు. 16 బంతుల్లో రెండు బౌండరీలు, సిక్సర్‌తో 22 పరుగులు చేసిన హస్సీ అశ్విన్ బౌలింగ్‌లో బ్రావోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపాడు. మార్ష్ సహా సహచరులు వెంటవెంటనే ఔటవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. 51 బంతులను ఎదుర్కొన్న మార్ష్ 8 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. చివరి ఓవర్‌లో బ్రావో కీలకమైన మూడు వికెట్లు తీయడంతో చెన్నైకి విజయం ఖాయమైంది. గురుక్రీత్ సింగ్, సతీశ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. రెండు వరుస బంతుల్లో మార్ష్, గురుక్రీత్ వికెట్లను తీసుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు, శర్మ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. సెంచరీతో చెన్నై విజయంలో కీలకభూమిక పోషించిన సురేశ్ రైనాకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.