రైల్వే బాదుడు తప్పదు

4

రైల్వే మంత్రి గ్రీన్‌  సిగ్నల్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి19(జనంసాక్షి): రైల్వే ఛార్జీలు పెరుగుతాయని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.  ఛార్జీలను  ఇంతకంటే తగ్గించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా అన్నారు. ఇప్పటికే ఛార్జీలు తక్కువగా, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అధిక సబ్సిడీని కల్పిస్తోందన్నారు. వచ్చే వారంలో పార్లమెంటులో రైల్వే బ్జడెట్‌ ప్రవేశపెట్టే దశలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిని బట్టి ఛార్జీలు పెరుగుతాయని అని స్పష్టం అయ్యింది.మిత్తల్‌ కమిటీ సిఫార్సుల మేరకు 400 కి.విూ.ల లోపు దూర ప్రయాణాలకు టికెట్‌ ధరలను పెంచటంపై రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రైలు ప్రయాణానికి రైల్వేలు చేస్తున్న ఖర్చు.. వస్తున్న ఆదాయంకన్నా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో టికెట్‌ ధరలు పెంచాలని మిత్తల్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఏటా రైల్వేకు ఈ నష్టాలు భారీఎత్తున ఉంటున్నాయి. దీనికి శాశ్వతపరిష్కారంతోపాటు రైల్వేలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై అధ్యయానికి డీకేమిత్తల్‌ కమిటీని సురేశ్‌ప్రభు ఏర్పాటు చేశారు. నష్టాల నివారణకు టికెట్‌ ధరలను పెంచటంతోపాటు ఇతర ప్రతిపాదనలను కూడా మిత్తల్‌ కమిటీ చేసింది.ప్రతీరెండు నెలలకు కి.విూ.కు రెండుపైసల చొప్పున పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అలాగే  వినియోగదారుల ధరల సూచీకి అనుగుణంగా రైలు టికెట్ల ధరలను పెంచటం. ఈ రెండింటిలో మొదటి మార్గానికే రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. స్వల్పదూరాలు ప్రయాణించే సబర్బన్‌, ఇంటర్‌సిటీ రైళ్లలో రెండోతరగతి కంపార్ట్‌మెంట్లకు ఈ ధరల పెంపుదలను వర్తింపజేయాలని మంత్రి యోచిస్తున్నట్లు సమాచారం.