రోగాల బారిన పడుతున్నాం రోడ్డు వేయండి
రోడ్డుపై నాటేసి నిరసన తెలిపిన కాలనీవాసులు అలంపూర్ సెప్టెంబర్ 9(జనంసాక్షి) అలంపూర్ మండలపరిధిలోని లింగనవాయి గ్రామంలో రవీంద్రనాథ్ కాలనీలో అంతర్గత రోడ్లు బాగు చేయాలని, గత కొన్ని సంవత్సరాలుగ అధికారుల దృష్టికి తీసుకు వస్తున్న స్పందించకపోవడంలేదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాలనీవాసులు పెద్ద ఎత్తున కదలివచ్చి బురదలో నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. గత నాలుగు రోజులనుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ల ముందు నీరు నిలచి,గుంతల మయం కావడంవలన అందులో దోమలు, ఈగలు చేరి కాలనీవాసుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆసుపత్రుల పాలవుతున్న పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొందని,గతంలో బాగు చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఇదే రోడ్డు గుండా కూలి పనులకు కూలీలు, పంటపొలాలుకు రైతులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలు, వృద్ధులు,గర్భిణీ స్త్రీలు,పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సమస్య కు పరిష్కారం చూపాలని సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి జీకే ఈదన్న డిమాండ్ చేశారు. నిరసనలు కాలనీవాసులు నజీర్, అహ్మద్,రహీం,మద్దిలేటి, రామచంద్రుడు, మధు, భాష,నూర్జహాన్, అలింబి, జయమ్మ, అనురాధ, లక్ష్మీదేవి, తదితరులు, నిరసనలో పాల్గొన్నారు.