రోడ్డుప్రమాదంలో సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి,సెప్టెంబర్1(జనం సాక్షి): షేట్‌బషీరాబాద్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమదంలో సూరజ్‌సింగ్ (28) అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. సుచిత్ర కూడలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ సూరజ్‌సింగ్ బైక్‌ను ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. పోస్టుమార్టం కోసం సూరజ్‌సింగ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.