రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజష్ట్రార్ నర్సింహరాజు కుమారుడు మృతి
ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిష్ట్రార్ నర్సంహరాజు కుమారుడు రాంచందర్ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున గ్రామీణ బ్యాంకుకు ఫీల్డ్ ఆఫీసర్‌గా వచ్చారు. గత రాత్రి ఖమ్మం వెళ్లి సినిమాచూసి బైక్‌పై వైరాకు తిరిగివస్తుండగా వాహనం డివైడర్‌ను ఢికొని కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం అయింది. దారినవెళ్లేవారు చూసి ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో రాంచంద్రరాజు ఆసుపత్రిలో మృతి చెందారు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఢిల్లీనుంచి వచ్చారు. ఆయన వారికి ఏకైక కుమారుడు కావటంతో వారి విషాదానికి అంతులేకుండా పోయింది.