రోడ్డు మరమ్మతు చేపట్టిన సులానగర్ యూత్

పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
* స్వచ్ఛందంగా పలుగు, పార పట్టిన యువకులు

టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి) : సుమారు రెండు నెలలుగా ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి మండల పరిధిలోని సులానగర్ గ్రామంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రవాణా ప్రయాణికు లు నరకయాతన పడుతున్నారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టాలని, ప్రయాణికులు ప్రమాద బారిన పడుతున్నారని ఈ నెల 18న జనం సాక్షి వార్తా పత్రిక లో కథనం ప్రచురించింది. ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నేరెత్తిన విధంగా ఉండి పట్టించుకునే వారే కరువువడంతో స్పందించిన సులానగర్ యూత్ స్థానిక సర్పంచ్ కుమారుడు అజ్మీర్ అశోక్, వార్డ్ మెంబర్ చింతమల్ల వీరస్వామి ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీకి చెందిన యువకులు బల్లెం లాలు రాస మల్ల చంద్రశేఖర్ కాలే వంశీ పనితి బిక్షం వల్లాల రవీందర్ గోస్ నవీన్ ఆలోతు ప్రసాద్ తదితరులు గుంతలకు తాత్కాలిక మరమ్మత్తులు ఆదివారం రాత్రి చేపట్టారు. దీంతో కాస్త ప్రయాణికులకు ఊరట కలిగింది. యూత్ చేపట్టిన మరమ్మత్తు సేవా కార్యక్రమానికి గ్రామస్తులతోపాటు ప్రయాణికులు యూత్ కి అభినందనలు తెలిపారు. యూత్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆశిద్దాం…