రోహిత్ కుమార్ హత్యకు పాల్పడిన దోషులను కట్టినంగా శిక్షించాలి.

నెరడిగొండ అక్టోబర్20(జనంసాక్షి):
ఓ గిరిజన విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించడానికి హైదరాబాద్ పట్టణంలో వెళ్లిన బీటెక్ గిరిజన ఏజెన్సీ విద్యార్థి రాథోడ్ రోహిత్ కుమార్ ఇటీవల జరిగిన మృతి పైన పలు అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వ యంత్రాంగం  దర్యాప్తు జరపాలని జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ విలేకరి సమావేశంలో డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు భయాందోళనకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తు దోషులు ఎంతటి స్థాయిలోని వ్యక్తులు ఉన్న నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని మృతుడి కుటుంబానికి సత్వర న్యాయం చేయడానికి 50లక్షలు రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనిడిమాండ్ చేస్తు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ఇట్టి మా డిమాండ్ కుఅంగీకరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని తెలిపారు.
Attachments area