ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు…

-సమావేశంలో మాట్లాడిన జడ్జి గంట కవిత దేవి

-ఎంఏఎల్‌డీ కళాశాలలో  విద్యార్థులకు అవగాహన..

గద్వాల రూరల్ జులై 28 (జనంసాక్షి):-  విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుందని గద్వాల సీనియర్‌ సివిల్‌ జడ్జి గంట కవితాదేవి అన్నారు. మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌ చేయడం వల్ల కలిగే అనర్థాలపై జిల్లాకేంద్రంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా జడ్జి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్ధాయికి ఎదగాలని, మీ తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాల న్నారు.  విద్యార్థినుల పట్ల గౌరవంగా ఉండాలని ఆమె సూచించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీపతినాయుడు, వైస్‌ ప్రిన్సిపాల్‌ మంజులత, యాంటి ర్యాగింగ్‌ కన్వీనర్‌ శివారెడ్డి, బాలరక్షాభవన్‌ కో-ఆర్డినేటర్‌ హేమలత, న్యాయవాదులు నాగరాజు, శ్రీనిత, వరలక్ష్మి, లక్ష్మన్న, రమేష్‌, డీసీపీవో నర్సింహులు పాల్గొన్నారు..