లండన్‌ ఒలింపిక్స్‌కు కరణ్‌ జోహార్‌

-ప్రత్యేక ఆహ్వానం పంపిన బ్రిటన్‌
ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌కు అరుదైన అవకాశం దక్కింది. లండన్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాన్ని అతిరథమహారథులతో కలిసి కూర్చుని తలికించబోతున్నాడు. ఈ మేరకు కరణ్‌కు బ్రిటతన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పంపించింది. భారత్‌ నుంచి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు ఓపెనింగ్‌ సెర్మనీని ప్రత్యేకంగా తిలకించేది కరణ్‌ మాత్రమే.. గత ఏడాది మే నెలలో బ్రిటన్‌ ప్రభుత్వం కరణ్‌ జోహార్‌ను తమ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఆ కోటాలో భాగంగానే ఇప్పుడు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. దీంతో జూలై 27న జరుగనున్న ప్రారంభోత్సవ వేడుకలను ఈ బాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రపంచ వ్యాప్తంగా అతిథులుగా వస్తోన్న వారితో కలిసి వీవీఐపీ బాక్స్‌లో కూర్చుని వీక్షించనున్నాడు. గత కొన్ని నెలలుగా కరణ్‌ షూటింగ్స్‌తో బీజీగా ఉన్నప్పటికీ… ఓ పెనింగ్‌ సెర్మనీకి ఖచ్చితంగా వెళ్లమన్నాడు. దీని కోసం తన షూటింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసుకొని కొన్ని వాయిదా వేసుకున్నాడు. దీనిలో తాను భాగం కావడం చాలా గర్వంగా ఉందని కరణ్‌ అన్నాడు. తన జీవితంలో లండన్‌ ఒలింపిక్స్‌ ఒక మధురఘట్టంగా నిలిచిపోతుందని చెప్పాడు.