లక్నవరం జింకల పార్క్ ఎకోపార్క్‌గా అభివృద్ది
ఇసి జాయింట్ సీఈవో రవికిరణ్ సూచన
ములుగు,ఫిబ్రవరి24(జనంసాక్షి): లక్నవరం సవిూపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఎకో పార్కుగా పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈవో రవికిరణ్ అధికారులకు సూచించారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సవిూపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జింకల పార్కును ఆయన సందర్శించారు. గతంలో భూపాలపల్లి జిల్లా డీఎఫ్‌వోగా పనిచేస్తున్న క్రమంలో లక్నవరం సవిూపంలో జింకల పార్కు ఏర్పాటుకు సన్నాహాలు చేసి పనులు ప్రారంభించిన ఆయన కొద్ది రోజుల క్రితం బదిలీపై వెళ్లారు.ఈ క్రమంలో ఆదివారం ఆయన జింకలపార్కును సందర్శించి అటవీశాఖ అధికారులకు పలు సూచనలు అందించారు. అటవీ సంపద, రక్షణ అవగాహన మేరకు బోర్డులు పెట్టాలని, జింకల బాగోగులు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ శని, ఆదివారాలు నిర్వహిస్తున్న లక్నవరం ఫెస్టివల్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ప్రచారం చేపడుతూ పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు అందించాలని సూచించారు.