లక్షల్లో ఒకరికి ప్రజాసేవ చేసే అవకాశం
-ఐదేళ్ల వరకు అవిశ్వాసం లేకుండా చట్టం తెస్తాం
-స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేయండి
-మేయర్లకు సీఎం కేసీఆర్ పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి14(జనంసాక్షి): లక్షల మందిలో ఒకరికి మాత్రమే ప్రజా ప్రతినిధిగా పనిచేసే అరుదైన అవకాశం వస్తుందని, దీన్ని సద్వినయోగపరుచుకుని సేవలు అందించి ప్రజల మనసుల్లో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. టూరిజం ప్లాజాలో శనివారం జరిగిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కవిూషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి , మహేందర్ రెడ్డి పార్లమెంటరీ కార్యదర్శులు వినయభాస్కర్ జలగం వెంగల్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎంజీ గోసాల్ , మున్సిపల్ అడ్మినిస్టేష్రన్ కవిూషనర్ జనారర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలు మధ్యలో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం, సౌకర్యాల కల్పిన కోసం కృషి చేయాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నగరాలు, పట్టణాలలో సరిస్తితి ఏమి బాగాలేదని, ప్రజలు మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఐదేళ్లపాటు పాలక మండలిపై అవిశ్వాసం ప్రవేశపెట్టకుండా చట్టాన్ని తీసుకొచ్చే యోచన చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. అన్ని నగరాలు, పట్టణాలు అద్బుతంగా తయారయ్యేందుకు అవసరమైన ప్రణాళికను వేసుకుని ముందుకు పోవాలన్నారు. ముఖ్యంగా చాలా నగరాలు పట్టణాల్లో ప్రజలకు సురక్షిత నీరఉ అందడం లేదరి, వచ్చే కొద్దిపాటి నల్లా నీరు కూడా ప్రతిరోజు రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు తెలంగాణ వ్యాప్తంగా మంచి నీటి పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ప్రతి మనిషికి 135 లీటర్ల చొప్పున మంచినీళ్లు అందివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ద్వారా పట్టణాలకు మంచినీళ్లను సరఫరా చేస్తామని, ఆ నీళ్లను ప్రతి ఇంటికి పంపించే బాధ్యతలను కార్పోరేషన్లు, మున్సిపాలిటిలు స్వీకరించాలన్నారు. పట్టణం సవిూపంలోని గుట్టలపై కాని, ఎత్తైన ప్రదేశంపై కాని సంపు నిర్మంచుకోవాలని సూచించారు. అక్కడి నుండా గ్రావిటీ ద్వారా అన్ని ఇండ్లకు నీళ్లు పంపిచాలన్నారు. కేవలం ఇండ్లకే కాకుండా బస్ట్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మంచినీళ్లీవ్వాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని తెలంగాణలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణాలను పరిశుభ్రంగా మార్చడానికి, అవసరమైనన్ని టాయిలెట్టు, నిర్మించడానికి, సవచ్చ్‌భారత్ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణలో స్వచ్చ తెలంగాణ-స్వచ్చ్ భారత్ నినాదంతో ఈ కార్యక్రమం అమలు చేసుకుందామన్నారు. ఆయా పట్టణాల్లో ఎన్ని కూరగాయాల మార్కెట్లు, మాంసాహార మార్కెట్లు, పార్కులు, స్మశాణ వాటికలు, బరేల్ గ్రౌండ్స్, డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో చూసుకుని ఇంకా ఎన్ని కావాలో ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. వీటి నిర్మాణానికి వనపరుల సవిూకరణ కోసం కూడా మార్గాలు అన్వేషించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల నుండి కూడా కొంత మొత్తాన్ని మున్సిపాలిటీలకు కేటాయిస్తామన్నారు. తాను ఇటీవల వరంగల్, మహబూబ్‌నగర్‌లలో పర్యటించానని, అక్కడ పేదలు దుర్బర పరిస్థితుల్లొ బతుకుతున్నారన్నారు. అలాంటివారి కోసం దశల ఇండ్లు కట్టిస్తామని చెప్పారు.