లక్ష్మారెడ్డి మృతి తీరనిలోటు
మహబూబాబాద్, నవంబర్ 11(జనంసాక్షి):
సీపీఐ మండల నాయకులు చెలమల్ల నారాయణ మృతి పార్టీకి తీరనిలోటని పార్టీ మండల కార్యదర్శి కట్లోజు పాండురంగాచారి అన్నారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో లక్ష్మారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగాచారి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పార్టీలో పనిచేస్తూ, పార్టీ అభివృద్ది కోసం ఎంతగానో కృషిచేశారని తెలిపారు. లక్ష్మారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో మానుకోట పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరిపెల్లి వెంకన్న, చింతకుంట్ల వెంకన్న, నాయకులు రేషపల్లి నవీన్, కేదాసు రమేష్, ఎండి ఫాతిమా, మంద శంకర్, బోళ్ల కిష్టయ్య, ఎండి మహమూద్, బిచ్చ, విజయలక్ష్మి, బానోతు లింగ్య, శ్రీశైలం, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.