లక్ష్మినర్సింహునికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

3

నల్లగొండ,ఫిబ్రవరి27(జనంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బ్ర¬్మత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం స్వామివారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వార్షిక బ్ర¬్మత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనరసింహా స్వామి కల్యాణోత్సవంలో  ముఖ్యమంత్రి సతీసమేతంగా పాల్గొన్నారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ లో బయలుదేరి యాదగిరి గుట్టకు వెళ్ళారు. మరోవైపు కేసీఆర్‌ అధ్యక్షుడుగా యాదగిరిగుట్ట డెవలప్‌ మెంట్‌ బోర్డు ఏర్పాటు అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన యాదగిరి గుట్ట అభివృద్ది సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట బ్ర¬్మత్సవాల సందర్భంగా కెసిఆర్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు.సంప్రదాయబద్దంగా ఆయన తలపాగా ధరించి, దానిపై ఆయన పళ్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయంలో ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించారు.యాదగిరి గుట్టకు ఏటా వంద కోట్లు ఖర్చు చేస్తామని కెసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. యాదగిరి గుట్టకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దానికి ఆయన విశిష్టత తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అదులో భాగంగా అబివృద్ది బోర్డును కూడా వేస్తున్నారు.కాగా యాదగిరిగుట్టలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంచారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు ను సైతం గుట్టపైకి పోలీసులు అనుమతించలేదు. అదేవిధంగా భక్తులెవరినీ గుట్టపైకి అనుమతించపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.ఆలయంలో నేటి రాత్రి అత్యంత విశేష పర్వమైన కల్యాణోత్సవం జరగనుంది. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు కల్యాణపర్వంలో పాల్గొనేందుకు రాత్రి యాదగిరిగుట్టకు రానున్నారు.