లక్ష్మీ బ్యారేజ్లో భారీగా వరద నీరు

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మీ బ్యారేజిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఉదయం 6 గంటలకు ఇరిగేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బ్యారేజికి 22,15,760 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే మొత్తంలో కిందకి వదులుతున్నారు. అయితే ఇంతకు ముందెన్నడు లేని విధంగా బ్యారేజి లెవల్ కి మించి వరద రావడం రైతులకు భాదాకరమైన విషయం. బ్యారేజి లెవెల్ 100 మీటర్లు కాగా ప్రస్తుతం 102.10 మీటర్లలో వరద ప్రవహిస్తున్నది. బ్యారేజి పరివాహక గ్రామాలైన సూరారం, అంబట్ పల్లి, బెగులూర్, బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్, ఎలికేశ్వరం గ్రామాల రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములలో భారీగా గోదావరి చేరే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు