లక్ష సాధన కోసం అవిశ్రాంత పోరాటం చేయాలి – రిటైర్డ్ ఐఏఎస్ చోల్లెటి ప్రభాకర్

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు అకుంఠిత దీక్ష, కటోర శ్రమతో పాటు అవిశ్రాంత పోరాటం చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ చోల్లెటి ప్రభాకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎస్ఎస్సీ స్టడీ సర్కిల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు పోటీ పరీక్షలలో ఎలా రాణించాలో మెళుకువలు తెలిపారు.యుపీఎస్సీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించారు.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి ఆర్టికల్స్ తో సహా అవగాహన కల్పించారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావుల గురించి, వారు చిన్నతనంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, ఎలా ఉన్నత శిఖరాలకు చేరారో తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, సహకారంను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం టిఎస్ఎస్సీ స్టడీ సర్కిల్- సూర్యాపేట హనరరీ డైరెక్టర్ చిట్టిపాక రాములు మాట్లాడుతూ స్టడీ సర్కిల్ ని సందర్శించి, అభ్యర్థులకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు