లడాయి ఆపొద్దు

తెలంగాణ వస్తుంది
హైదరాబాద్‌లో తెలంగాణలో అంతర్భాగం
కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌
హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి) :
లడాయి ఆపొద్దు తెలంగాణ రాష్ట్ర వస్తుందని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుందని కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్‌ తేల్చి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014లోపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రంలో మరోసారి యూపీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే తెలంగాణ రావడం ఖాయమని పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో ఎవరూ అధికారంలో వచ్చినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో అజిత్‌సింగ్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉందని ఎన్డీయే కూటమి ఈ సమస్యను పరిష్కరించ లేదని ఆయన తెలిపారు. గతంలో మూడు రాష్టాల్రు ఇచ్చిన ఎన్డీయే తెలంగాణ రాష్టాన్న్రి మాత్రం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 2014లో యూపీఏ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్నారు. యూపీఏలోని మెజార్టీ భాగస్వామ్య పక్షాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కానీ, ఢిల్లీలో సమన్వయం లేకే ఆలస్యమవుతోందన్నారు. అయితే, 2014 ఎన్నికల లోపు తెలంగాణ రాదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం గెలిచినా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రజలే తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకుంటారని పేర్కొన్నారు. యూపీఏని మళ్లీ గెలిపిస్తే తెలంగాణ ఇస్తుందని తెలిపారు. ఢిల్లీ వెళ్లాక తెలంగాణ అంశంపై సోనియాను కలుస్తానన్నారు. స్తానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్టీయ్ర లోక్‌దళ్‌ పోటీ చేస్తుందని ప్రకటించారు.జాతీయ పార్టీలతోనే తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎల్డీ నేత దిలీప్‌కుమార్‌ పేర్కొన్నారు. జాతీయ పార్టీల మద్దతు లేకుండా తెలంగాణ ఎలా తెస్తారని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను 15 లోక్‌సభ స్థానాల్లో గెలిపిస్తే తెలంగాణ తెస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ 17 ఎంపీ సీట్లు గెలిచినా తెలంగాణ రాదని స్పష్టం చేశారు. తెలంగాణ కేవలం జాతీయ పార్టీలతోనే సాధ్యమన్నారు. జాతీయ పార్టీల మద్దతు లేకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించలేమని తెలిపారు.