లయన్స్ సేవలు అమోఘం
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణెళిష్
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): నిజామాబాద్ నగరం ఖలీల్‌వాడిలోని లయన్స్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్జికల్ ఐ క్యాటరాక్ట్ ఫెకో మిషన్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణెళిష్ గుప్త బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫెకో మిషన్ ద్వారా క్యాటరాక్టు ఆపరేషన్ కోసం వచ్చే వారికి అత్యాధునిక సేవలందుతాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేని పేదలకు లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా తక్కువ ఖర్చుతో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులను అభినందించారు. లయన్స్ ఐ ఆసుపత్రిలో అందిస్తున్న అత్యాధునిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జిల్లా నగర ప్రజలను కోరారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, లయన్స్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకులు పి.బసవేశ్వర్ రావ్, చైర్మన్ నర్సింహా రెడ్డి, లయన్స్ ట్రస్ట్ సభ్యులు కొడాలి కిషోర్, శ్రీనివాస్ రావు, ప్రకాష్ గుప్త, రీజియన్ చైర్మన్ ద్వారకాదాస్ అగర్వాల్, డిస్టిక్ట్ర్ హెల్త్ కో ఆర్డినేటర్ కరిపె రవీందర్, లయన్స్ ప్రతినిధులు డి.యాదగిరి, పి.లక్ష్మీనారాయణ, ఉండవల్లి శివాజి, గంగాదాస్, సూర్యభగవాన్, రవీందర్ గుప్త, శంకర్, డా.దీప్తి, డా.సందీప్ పాల్గొన్నారు.