లయన్స్ సేవా తరుణి ఆధ్వర్యంలో అన్నదానం

తొర్రూరు:15 అక్టోబర్ (జనంసాక్షి )మానవసేవ మాధవ సేవకు మించిందని అవసరార్థులకు కడుపునిండా అన్నం పెట్టిన వారు మహా దానం చేసిన పుణ్యం కట్టుకుంటారని లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి అధ్యక్షురాలు వజినపెళ్లి దీప తెలిపారు. ప్రపంచ ఆహార దినోత్సవం, క్లబ్ సభ్యురాలు దొనికెన రజిని జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం తొర్రూరులో నిరుపేదలకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అవసరార్థులకు నిరంతరం సేవలందించడమే లయన్స్ క్లబ్ ల లక్ష్యమని తెలిపారు.  సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ లు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే క్లబ్ ప్రతినిధులు, నాయకత్వం వహించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టిన వారి జన్మదినం సందర్భంలో ఈ తరహా సేవలు అందించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. అన్ని దానాల్లో  అన్నదానాన్ని మహాదానంగా అభివర్ణిస్తారని మనకు చేతనైనంత మేరకు పేదల కడుపు నింపే కార్యక్రమాలు చేపడితే ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది చెప్పారు.  ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి వజినేపల్లి శైలజ, కోశాధికారి చీదర నీలిమ, పెరుమాండ్ల స్వాతి, దొనికెన నగేష్, పెరుమాండ్ల రమేష్, మహంకాళి భూపతి, మెండిస్ తదితరులు పాల్గొన్నారు.