లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన సంతోషిమాత
సూర్యాపేట (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మ వారు లలితా త్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ శ్రీ లలితా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకరణ దాతలు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు.నవరాత్రులు పురస్కరించుకొని చండీహోమం,రుద్రహోమం,
శ్రీ చక్ర కుంకుమార్చన పూజలు, భవాని దీక్ష మాలాధారణ పూజలు, బ్రహ్మణ ముత్తైదువకు సుహాసిని పూజ నిర్వహించారు.శుక్రవారం కావడంతో అమ్మ వారికి గాజుల పూజ,ఉద్యాపన వ్రతం, వడిబియ్యం పోశారు.అమ్మ వారిని కీర్తిస్తూ పాటలు పాడారు.పవళింపు సేవా కార్యక్రమం నిర్వహించారు.భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా,బ్రాహ్మాండ్లపల్లి మురళీధర్,ఉపాధ్యక్షులు నరేంద్రుని విద్యాసాగర్ రావు, అన్నదాన నిర్వాహకులు కొత్త మల్లికార్జున్, దేవిదత్తు, కమిటీ సభ్యులు సోమ శ్రీశైలం, నామిరెడ్డి పాపిరెడ్డి, దేవరశెట్టి సోమయ్య , యామ వెంకటేశ్వర్లు,మహంకాళి ఉపేందర్, ముదిరెడ్డి లింగారెడ్డి,అర్చకులు మంగిపుడి వీరభద్రశర్మ , బాబ్జి శర్మ , దేవాలయ మేనేజర్ బచ్చుపురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.