లాఠీ ఛార్జ్,అరెస్టులు సరికాదు
సిపిఐ ఖండన
వనపర్తి సెప్టెంబర్ 14 (జనం సాక్షి)సమస్యల పరిష్కారం కోసం చలో అసెంబ్లీ చేపట్టిన వీఆర్ఏ ల పై లాఠీచార్జ్,న్యాయం కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు,ప్రజా సంఘాల నేతల ను అరెస్టు చేయటం సరికాదని అమానుషమని సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు ప్రభుత్వ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు అసెంబ్లీలో చర్చించాల్సిన చాలా ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ,చలో అసెంబ్లీకి భయపడి మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగించారేమో అన్న అనుమానం కూడా కలుగుతోందని తెలిపారు.36 మందికి పైగా వీఆర్ఏలు ఉద్యోగ భద్రతపై భయంతో,కుటుంబ ఆర్థిక పరిస్థితి చితికి చనిపోవడం జరిగిందని ఇది శోచనీయమని తెలిపారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే లాఠీచార్జి చేయించటం ప్రజాస్వామ్యకమని తెలిపారు . భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని
ఉపాధ్యాయులు చలో అసెంబ్లీ చేపడితే అరెస్టులు చేయటం సరి కాదని తెలిపారు వీఆర్ఏలు,ఉపాధ్యాయులు,ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.