*లింగంపేట్ లొ భారీవర్షం
పెద్దవాగు పరుగులు
*77 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
*హర్షం వ్యక్తం చేసిన రైతులు
లింగంపేట్ మండలంలోని ఆదివారం రాత్రి భారీవర్షం కురిసింది.అట్టి వర్షానికి లింగంపేట్ పెద్దవాగు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది.భారీ వర్షం పడడంతో మండలంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బోర్లవద్ద వరినాట్లు వేస్తున్నారు. ఆదివారం మండలంలొ 77.8 మిల్లిలీటర్ల భారీవర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.ఎగువ ప్రాంతమైన గాంధారి మండలంలోని కూడా భారీవర్షం పడడంతో లింగంపేట్ పెద్దవాగు పరుగులు పెడుతూ ప్రవహిస్తుంది.పోచారం డ్యాం లోకి నీళ్లువెళ్ళు తుండడంతొ పోచారం ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈసారి భారీవర్షాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.దాంతో రైతులు వర్షాకాలం పొలం పనులు దున్నకాల్లొ ఇతరాత్రా పనుల్లో నిమగ్నమయ్యారు.