లింగ వివక్షత లేని సమాజం మన అందరి బాధ్యత…

వివక్ష నిర్మూలన ఇంటి నుండే ప్రారంభం కావాలి…
—— జిల్లా ఎస్పీ శ్రీ జె.రంజన్ రతన్ కుమార్…
  గద్వాల ప్రతినిధి డిసెంబర్ 06 (జనంసాక్షి):- లింగా వివక్షత లేని సమాజం మన అందరి బాధ్యత అని, అందుకు  ప్రతి ఒక్కరు లింగా వివక్ష నిర్మూలనకు ఇంటి నుండే నాంది పలకాలని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో మహిళలు,పిల్లలు ఎదురుకుంటున్న లింగ అసమానత సమస్య పై “లింగ వివక్షత లేని సమాజం కోసం చేపట్టే కార్యక్రమాలలో భాగంగా  జిల్లా ఎస్పీ పోస్టర్లను ఆవిష్కరించారు…ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళా సాధికారత కొరకు, మహిళలు మరియు పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం కోసం, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల విచారణను నిర్వహించడానికి రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ అధ్వర్యంలో అనేక చర్యలు రూపొందించబడిందని, ఇందులో ప్రత్యేకంగా అక్రమ రవాణా, లైంగిక నేరాలు, గృహ హింస, బాల్య నేరాలు, ఎన్‌ఆర్‌ఐ సమస్యలు & సైబర్ నేరాలు  వంటి సమస్యలకు నిర్దిష్ట పరిష్కారాలను అందించడం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పోలీసు యొక్క మహిళా భద్రతా విభాగం అధ్వర్యంలో 03 డిసెంబర్ 2022 నుండి 23 డిసెంబర్ 2022 వరకు నిర్వహించడం జరుగుతుందని,. లింగ వివక్షత నిర్మూలన, మహిళలు మరియు పిల్లల భద్రతనే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, లింగ సమానత్వం అనేది  స్త్రీ పోరాటం మాత్రమే కాదని మానవ పోరాటమని, ఆడపిల్ల స్వేచ్చగా తిరిగి ఇంటికీ  రాగలగడం లో సొసైటీ బాధ్యత కూడా వుందని అన్నారు.    లింగ వివక్షత ను సమూలంగా  నిర్మూలించుటకు మనమందరం మన ఇంటి నుండే ప్రారంభించాలని అన్నారు.  కాలానుగుణంగా లింగ వివక్షత తగ్గుతున్నదని సమూల నిర్మూలనకు  ప్రజలను మరింత చైతన్య పరచవలసిన అవసరము ఉందని అన్నారు.  సీడ్ పత్తి పొలాలలో పని చేస్తున్న బాలికల పై దృష్టి పెట్టి వారు స్కూల్ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని అన్నారు.ఒకప్పుడు మహిళలు ఉద్యోగ వృత్తి లోకి వచ్చేవారు కాదని కానీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల అన్నీ శాఖలతో పాటు పోలీస్  శాఖలో కుడా ఉద్యోగాలకు స్వేచ్చగా రాగలుగుతున్నరని ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు.     బాధితులు  తమ సమస్యని వ్యక్తపరిచినప్పుడు వారిని ఓపికగా వినాలని, వారిని నమ్మి తగిన మద్దతు ఇవ్వవలసిందిగా అధికారులను కోరారు. హింసకు, వివక్షకు గురి అయిన మహిళలకు, ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో, కుటుంబంలో, సంఘంలో, మరియు కార్యాలయంలో, మద్దతుగా నిలవాలని,  లింగ వివక్ష ఒక దురాచారమని అందుకు జిల్లా లో షి టీం బృందాలు, కళాబృందాలు, ఆంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బంది గ్రామాలలో, కళాశాలల్లో, స్కూల్స్ లలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ అధికారులకు సూచించారు. అవసరం ఐతే మహిళా విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు.   మహిళలకు శారీరక, భావోద్వేగ, మానసిక, వయస్సు, కులం, విద్యా స్థితి, వైవాహిక స్థితి, జాతి వంటి వాటితో ఎలాంటి సంబంధం లేకుండా వారి సమస్యలను పరిష్కరించాలని, వారికి తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో పోలీస్ వారు చేపడుతున్న కార్యక్రమాలు కీలకంగా పనిచేస్తాయని అన్నారు.  వివక్షతకు గురయ్యే మహిళలు భరోసా కల్పించే అధికారులతో మనసు విప్పి జరిగిన అన్యాయాన్ని వివరించవచ్చని తమకు ఎదురైన సమస్యను ఫిర్యాదు చేయడానికి  భయపడవలసిన అవసరం లేదని  అటువంటి వారికి అండగా నిలిచేదే మహిళా భద్రతా విభాగమని, జిల్లాలో  ఎవరైన ఇంట లేదా బయట వివక్షత ఎదుర్కునట్లు అయితే షి టీం, ఆంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను  తెలియపరుస్తే  వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత వారికి కౌన్సిలింగ్ చేసి తెలియజేస్తామని అన్నారు.  ముఖ్యంగా బాధిత మహిళలకు ఆత్మసైర్యాన్ని పెంచి మెరుగైన జీవనానికి భరోసా కల్పించాలని అధికారులకు తెలియజేశారు. అన్నారు. 24 గంటల పాటు పోలీసులు అందుబాటులో ఉండి బాధితులకు భరోసా ఇస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ. ఓ సతీశ్ కుమార్ గారు, ఆంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, షి టీం ఇన్స్పెక్టర్ రమేశ్ గౌడ్ గారు, వుమెన్ ఎస్సై లు ఏ. రజిత, జి. రజిత, ఎస్సై కేశవ రావు, షి టీమ్ సిబ్బంది, ఆంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బంది మరియు కార్యాలయ మహిళ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు