లిఖింపూర్ ఘటనపై సుపరీం సీరియస్
యోగి సర్కార్ అందచేసిన నివేదికపై సిజె అసంతృప్తి
యూపి వేసిన సిట్‌పైన అభ్యంతరం తెలిపిన చీఫ్ జస్టిస్ రమణ
తదుపరి విచారణ 2 నెల20కి వాయిదా
న్యూఢల్లీి,అక్టోబర్8 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో వాడివేడీ వాదనలు జరిగాయి. కేంద్ర మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. అసలు ఇంతవరకు కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయలేదని సూటిగా ప్రశ్నించింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్‌లో అందరూ స్థానికులే ఉన్నారని వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. సమయం ఇవ్వాలని యూపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టును కోరారు. తదుపరి విచారణను 20కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని సీజేఐ ఎస్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది. లఖింపూర్ హింసాత్మక ఘటనపై వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కాగా, మృతుల శరీరంలో బుల్లెట్లు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలిందని యూపీ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్ హరీష్ స్వాలే కోర్టుకు విన్నవించారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆశిష్ మిశ్రా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టు హరీష్ స్వాలే తెలిపారు. ఆశిష్ మిశ్రాను విచారించిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, దోషులను వదిలేది లేదని, కచ్చితంగా సంతృప్తికరమైన చర్యలే తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోర్టుకు విన్నవించారు. హరీష్ సాల్వే హావిూలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేస్తూ, స్థాయీ నివేదక సమర్పించాలని ఆదేశించింది. సాక్ష్యాలు తారుమారు కాకుండా పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని యూపీ పోలీస్ ఉన్నతాధికారులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.